సినిమాల్లోకి రాకముందు అషురెడ్డి ఆ పని చేసేవారా.. ఆమె వేతనం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టీవీ షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో అషురెడ్డి( Ashu Reddy ) ఒకరు కాగా అషురెడ్డి పలు సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా కూడా పాపులారిటీని పెంచుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా కూడా భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు.

అయితే టీవీ షోలు, సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారనే ప్రశ్నకు అషురెడ్డి నుంచి షాకింగ్ సమాధానం వినిపిస్తోంది.

నేను అన్ని ఫుడ్స్ తింటానని అయితే అయితే అదే సమయంలో వర్కౌట్లు( Ashu Reddy Workouts ) కూడా ఎక్కువగా చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం డైటింగ్ చేయాల్సిన అవసరం లేదని ఫుడ్ విషయంలో వేర్వేరు ఆప్షన్లు ఉన్నాయని అషురెడ్డి పేర్కొన్నారు.నాకు అప్పడం అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.

అప్పడం ఆయిల్ ఫుడ్ అయినప్పటికీ ప్రతిరోజూ నేను అప్పడం తినడానికి ఇష్టపడతానని అషురెడ్డి అన్నారు.నేను ఈ ఇండస్ట్రీలోకి రాకముందు ఐటీ జాబ్ చేశానని ఈ విషయం చాలామందికి తెలియదని ఆమె పేర్కొన్నారు.9 టూ 5 జాబ్ నేను చేశానని నాకు మంచి శాలరీ వచ్చేదని అషురెడ్డి చెప్పుకొచ్చారు.ఈ ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చానని ఆమె పేర్కొన్నారు.

Advertisement

అమెరికాలో ఐటీ జాబ్ చేసిన సమయంలో నాకు 1,20,000 రూపాయలు వేతనం వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు.

నా ఫస్ట్ శాలరీని సింహాచలం అన్నదాన ట్రస్ట్( Simhachalam Annadhana Trust ) కు నేను డొనేట్ చేశానని అషురెడ్డి వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ను కలిసిన సమయంలో ఆయన నన్ను గుర్తుపట్టడంతో నేను చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నాకు ఎంతగానో నచ్చుతుందని అషురెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పలు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అషురెడ్డి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు