Ashish Vidyarthi : నేను చావలేదు బ్రతికే ఉన్నాను.. నాకు అవకాశాలు ఇవ్వండి: ఆశిష్ విద్యార్థి

సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి సూపర్ హిట్ సినిమాలలో విలన్ పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు ఆశిష్ విద్యార్థి ( Ashish Vidyarthi ) ఒకరు.

ఈయన నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్న పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించారని చెప్పాలి.

ముఖ్యంగా పోకిరి ( Pokiri ) సినిమాలో ఈయన పాత్ర తనకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.ఇలా తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటించినటువంటి ఈయనకు ఇటీవల కాలంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఈయనకి అవకాశాలు లేకపోవడంతో ఆడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇక ఈ సినిమాలలో కూడా ఈయనకు సరైన పాత్ర మాత్రం రాలేదు.ఏదో అయిదు నిమిషాలు మాత్రమే అలా కనిపించి వెళ్ళిపోతున్నారు.

ఈయన చివరిగా తెలుగులో పద్మభూషణ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇకపోతే ఆరు పదుల వయసులో  ఆశిష్ విద్యార్థి రెండవ పెళ్లి ( Second marriage ) చేసుకుని వార్తలలో నిలిచారు.

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇటీవల కాలంలో తనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు అయితే తాను ఇప్పటికీ బ్రతికే ఉన్నానని, ఆ విషయాన్ని గుర్తించి తనకు కూడా అవకాశాలు కల్పించండి అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.తాను ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేశాను.

బలమైన రోల్స్ చేశాను, అయితే ఇప్పటికి తనని అలానే చూస్తున్నారు.అలాంటి పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు.

కానీ నేను ఈ విధమైనటువంటి పాత్రలో అయినా నటించగలనంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు