ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ?

సాధారణంగా గోరింటాకు అంటే ఇష్టపడని మహిళలు చాలా అరుదుగా ఉంటారు.పండుగలైనా.

వేడుకలు అయినా ముందుగా ఆడవారు గోరింటాకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.

కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.పూర్వం రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.

ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది.ఆషాఢమాసం వచ్చేస్తోంది .అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో అనాదిగా వస్తుంది.

Advertisement

అసలు దీని వెనుక ఉన్న కారణం ఏమిటో .మీకు తెలుసా.? ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి.వర్షరుతువు ప్రారంభం అవుతుంది.

గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది.ఆషాఢంలో బయట వాతావరణం చల్లగా మారుతుంది.

మన శరీరంలో ఉన్న వేడి .బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలు అవుతాయి.గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది.

అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.

How Modern Technology Shapes The IGaming Experience
న్యూస్ రౌండప్ టాప్ 20

మహిళలు.ఈ ఆషాడంలో అందంతో పాటు.

Advertisement

ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.

తాజా వార్తలు