MP Aravind: అరవింద్‌కు హైకమాండ్ నుండి అక్షింతలు!

ఎమ్మెల్సీ, కేపీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై భారతీయ జనతా పార్టీ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై అరవింద్‌కు హైకమాండ్ నుండి అక్షింతలు పడినట్లు తెలుస్తుంది.

అరవింద్  ఇటీవల విలేకరుల సమావేశాలలో కవితపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో అతని నివాసంపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడులకు పాల్పడ్డారు.  ఈ వ్వవహారంలో పార్టీ పెద్దల నుండి అరవింద్‌కు  సానుభూతి లభించకపోగా చీవాట్లు తిన్న ట్లు స మాచారం.

మహిళా నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న కవితకు సానుభూతి వస్తుందని బీజేపీ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.దీనికి తోడు నిజామాబాద్‌కు చెందిన పలువురు బిజెపి నాయకులు అరవింద్‌పై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు, అతను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అనవసరంగా తల దూరుస్తూ  పార్టీ కార్యకర్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు.

బోధన్‌లో పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ నియామకంలో ఆయన  ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా శనివారం పలువురు జిల్లా బీజేపీ నేతలు బహిరంగంగానే గళం విప్పారు.

Arvinds Loose Tongue To Cost Him His Seat Details, Mlc Kavitha, Nizamabad Mp Ara
Advertisement
Arvinds Loose Tongue To Cost Him His Seat Details, MLC Kavitha, Nizamabad MP Ara

నవంబర్ 28న భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మీనర్సయ్య సభ ప్రారంభించిన వెంటనే అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఎంపీ ప్రతిపాదించిన బోధన్‌ అసెంబ్లీ కన్వీనర్‌పై పార్టీ పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. కన్వీనర్ పేరును సూచించే ముందు అరవింద్ స్థానిక నేతలను సంప్రదించలేదని బృందం తెలిపింది.

ఎంపీ తీరుతో పార్టీ సీనియర్ నేతలు హర్ట్ అయ్యారని, పార్టీ నేతల పట్ల ఆయన వైఖరి మార్చుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు