ఆర్టికల్ 370 రద్దు కు వ్యతిరేకంగా పిటీషన్ లు, ఈ రోజే సుప్రీం విచారణ

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా మంది సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు అంశాలపై వచ్చిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జడ్జిలు SA బాబ్డే, S అబ్దుల్ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పరిశీలించనుంది.

మరో విషయం ఏమిటంటే ఈ పిటీషన్ లో కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యక్తిగత పిటీషన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.తన కుటుంబ సభ్యులను కలవడానికి ఆయన ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించగా ఆయనను ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి పంపేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

  అయితే ఈ పిటీషన్ లు అన్నిటి పై సుప్రీం కోర్టు ఒకేసారి విచారణ చేపడతామని చెప్పడం తో ఈ రోజే ఈ పిటీషన్ లు అన్నింటిపై విచారణ చేపట్టనుంది.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు