టీటీడీ అడ్వైసర్ గా ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని నియమించిన టీటీడీ..

టీటీడీ అడ్వైసర్ గా ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని నియమించింది టీటీడీ.

తిరుమల లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కు నన్ను నియమించి నందుకు ఆనందంగా ఉందని అన్నారు ఆనంద సాయి.

బాలాంజనేయ ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి లతో కలిసి పరిశీలించాను అని దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందని, ఈ నెల 16వ తేదీన భూమి పూజ రోజున దీనికి సంబంధించి ఆర్ట్ వర్క్‌ మీడియాకు చూపిస్తామని అన్నారు.అలాగే గోగర్బం డ్యామ్ వద్ద 1.5 ఎకరాలలో బృందావనం మెడిటేషన్ హాల్ నిర్మించనున్నామని, గోగర్బం డ్యామ్ రింగ్ రోడ్డు వద్ద 30 అడుగుల ఆంజనేయ విగ్రహం ఏర్పాటు కు ప్రణాలికలు చేసామని, బాల ఆంజనేయ ఆలయం వద్ద రెండు గోపురాల నిర్మాణానికి ప్రణాలికలు చెసామన్నారు.యాదాద్రి నిర్మాణం తరువాత తిరుమలలో ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆనంద సాయి.

Art Director Anand Sai As Ttd Advisor Details, Art Director Anand Sai ,ttd Advis
ప్రతి రోజు గుప్పెడు అవిసె గింజలను తింటే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు

తాజా వార్తలు