వైరల్: ఈ కుక్క తనకి... విశ్వాసమే కాదు, దేశభక్తి కూడా ఎక్కువే అని నిరూపించింది!

అవును, మీరు ఇక్కడ చదివింది వందశాతం నిజం.ఈ కుక్కని చూసి కొంతమంది కుంచిత స్వభావులు ఎంతైనా నేర్చుకోవలసిన అవసరం వుంది.

ఇక్కడ ప్రతిఒక్కరికీ ఆగస్టు 15 నాడే దేశం గుర్తుకు వస్తుంది.జాతీయ జెండాలు ఎగరేసి తెగ లెక్చర్లు ఇస్తూ వుంటారు.

బయట చూస్తే వీరి బండారం బయట పడుతుంది.అయినదానికీ కానిదానికీ దేశాన్ని తిడుతూ వుంటారు.

పోనీ వీరు దేశానికి ఏదన్నా చేస్తారా అంటే, కష్టమే.వీరు భూమికి భారం కాకుండా ఉంటే చాలు.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళితే, నెట్టింట్లో మనం అనేకరకాల వైరల్ వీడియోలను చూస్తూ ఉంటాం.అయితే ఇది నెక్స్ట్ లెవల్ వీడియో అని చెప్పుకోవాలి.అవును, సాధారణంగా శునకాలు విశ్వాసానికి మారుపేరు వంటివి.

ఇవి విశ్వాసంలో మనిషినే మించిపోతాయి.అంతేకాదు.

దేశ భక్తిలో కూడా ఇవి మనిషిని మించిపోతాయి అని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తేనే మనకి అర్ధం అవుతుంది.మనుషుల కంటే జంతువులు ఎక్కువ భావోద్వేగాలకు లోనవుతాయి అని దీనిని చూస్తేనే మనకు అర్ధం అవుతుంది.

ఇక్కడ వైరల్ వీడియోని గమనిస్తే, ఓ కుక్కకి ఇక్కడ ఓ టెస్టు పెట్టినట్టు అర్ధం అవుతుంది.ఎందుకంటే అక్కడ వివిధ దేశపు జండాలు ఉన్నప్పటికీ ఆ కుక్క మాత్రం భారత మ్యాప్‌ వద్దకు వచ్చి తన 2 కాళ్లను పైకెత్తి తల్లి భారతికి నమస్కరిస్తున్న దృశ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఒక కార్యక్రమంలో కొన్ని ఆర్మీ కుక్కలు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

నోరులేని మూగజీవి, విశ్వాసానికి ప్రతిరూపంగా చెప్పుకునే కుక్కకు వున్న దేశభక్తి అందరి హృదయాలను తాకింది.కాగా ఇప్పటి వరకు ఈ వీడియో 26.2 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌ని సాధించింది.

Advertisement

తాజా వార్తలు