ఈ తెలుగు హీరో ప్రముఖ పొలిటీషియన్ కొడుకని మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన "భద్ర" చిత్రం తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.

అయితే లవ్ అండ్ ఎమోషనల్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ తరహాలో విడుదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే అలరించింది.

కాగా ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించగా హీరోయిన్ గా మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్ నటించింది.అయితే ఈ చిత్రంలో రవితేజ స్నేహితుడు పాత్రలో నటించిన "అర్జన్ బజ్వా"  పాత్రకి కూడా సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

Do You Konw Arjan Bajwa Is A Bjp Party Leader Son Arjan Bajwa, Tollywood Hero,

ఇప్పుడు "అర్జన్ బజ్వా" గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.  అర్జన్ బజ్వా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో పుట్టి పెరిగాడు.

ఇతడి తండ్రి  స్వింధర్ జిత్ సింగ్ భారతీయ జనతా పార్టీ లో ప్రముఖ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతేగాక ఢిల్లీ నగరానికి ఉప మేయర్ గా కూడా కొంత కాలం పాటు పని చేశాడు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా అర్జన్ బజ్వా కి చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తాను కాలేజీ లో చదువుకునేటప్పుడే పలు మోడలింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.అంతేగాక పలు సంస్థల ఉత్పత్తుల  వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించాడు.

అయితే అర్జన్ భజ్వా 2001వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు సన్యాసి రెడ్డి దర్శకత్వం వహించిన "సంపంగి" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్ అయ్యింది.

  అయితే ఆ తర్వాత అర్జన్ బజ్వా నీ తోడు కావాలి, భద్ర, ప్రేమలో పావని కళ్యాణ్, కింగ్ మిత్రుడు అరుంధతి తదితర చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు