అప్పట్లో ఐ లవ్ యూ చాలాసార్లు చెప్పా.. ఇప్పుడు ఫిగర్ ని అందుకే చెప్పట్లేదు: అరియనా

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అరియానా తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే అప్పట్లో మోనాల్ గజ్జర్ నిబిగ్ బాస్ దత్త పుత్రిక అనేవారు కానీ అసలు దత్త పుత్రిక అంటే అరియానానే.ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు గత మూడేళ్లుగా బిగ్ బాస్‌‌‌కి దత్త పుత్రికగా మారింది అరియానా.

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చి టాప్ 4లో నిలివగా.ఆ తరువాత సీజన్ 5లో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

అనంతరం తాజాగా ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి రీ ఎంట్రీ ఇచ్చి టాప్ ఫైనలిస్ట్ అయ్యి 10 లక్షల ప్రైజ్ మనీ ని అందుకుంది అరియానా.,/br>బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 టాప్ 3 కంటెస్టెంట్ గా యాంకర్ శివ నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే తాజాగా యాంకర్ శివ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బిగ్ బాస్ టైటిల్ గెలవకపోవడానికి గల కారణాలనై తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది అరియానా.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

నేను బిగ్ బాస్ దత్త పుత్రికను.అందుకే కెమెరాల దగ్గరకు వెళ్లి అన్నిసార్లు ఐ లవ్యూ ఐ లవ్యూ అని చెప్పేదాన్ని.

బిగ్ బాస్ సీజన్ 4లో బిగ్ బాస్‌కి ఎక్కువసార్లు ఐ లవ్యూ చెప్పాను.కానీ ఇటీవల ముగిసిన ఓటీటీలో చాలా తక్కువే.

ఎందుకంటె మెచ్యురిటీ వచ్చేసింది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

పిల్లబచ్చాగా ఉన్నప్పుడు ఐ లవ్యూ చెప్పాను కానీ ఫిగర్ అయ్యాక ఐలవ్యూ చెప్పడం తగ్గించాను.కానీ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది అరియానా.బిగ్ బాస్ సీజన్ 4కి కప్పు కొట్టాలనే వెళ్లాను.

Advertisement

రెండో ఆలోచన లేకుండా కప్పు కోసమే గేమ్ ఆడాను.కానీ ఓటీటీ వచ్చేసరికి కొత్తగా వచ్చిన వాళ్లే కప్పు కొట్టడం కరెక్ట్ అని అనిపించింది.

షోలో ఉన్నప్పుడు నేను ఈ మాట చెప్పలేకపోయాను బయటపడలేదు. నా పోరాటం ఫోర్త్ సీజన్‌లోనే అయిపోయింది.

కానీ ఓటీటీకి ఎందుకు వచ్చానని అనుకోవచ్చు.ఎందుకంటే నాకు పాపులారిటీ కావాలి అని తెలిపింది అరియానా.