విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో వాదనలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి.స్టీల్ ప్లాంట్ భూముల విలువ కేవలం రూ.

55 కోట్లుగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.సదరు భూముల విలువ రూ.60 వేల కోట్లు ఉంటుందని పిటిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు.అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రం మరికొంత సమయం కోరింది.

దీంతో హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో వాదనలు జరగగా.కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం కోరిన విషయం తెలిసిందే.

Advertisement
కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!

తాజా వార్తలు