చంద్రబాబు బెయిల్ పిటిషన్‎పై ఏసీబీ కోర్టులో వాదనలు

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

వాయిదా అనంతరం విచారణ ప్రారంభం కాగా బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు.

అయితే కస్టడీ పొడిగింపుపై వాదనలు వినాలని సీఐడీ తనపు న్యాయవాదులు కోర్టును కోరారు.ఈ క్రమంలో మెమో ఫైల్ చేయాలని సీఐడీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో మెమో దాఖలు చేసేందుకు గానూ సీఐడీ సమయం కోరింది.ఈ నేపథ్యంలో సీఐడీ మెమో దాఖలు చేసిన తరువాత రేపు ఈ పిటిషన్లపై విచారణ జరుపుతామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.

చంద్రబాబు కస్టడీ నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించిన సీఐడీ అధికారులు చంద్రబాబును మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet