కరివేపాకులా వాడుకుంటున్నారా.. లోకేశ్ కామెంట్స్ పై జనసేన క్యాడర్ ఫైర్..!!

ఏపీలో ఎన్నికలు( Elections in AP ) సమీపిస్తున్న తరుణంలో సీఎంగా ఎవరు అధికార పీఠాన్ని ఎక్కబోతున్నారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.

ఓవైపు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ - జనసేన( TDP - Janasena ) ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీల నేతలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎవరూ గెలుస్తారనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే టీడీపీ నేత నారా లోకేశ్ పై జనసేన క్యాడర్ తీవ్రస్థాయిలో మండిపడుతుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా లోకేశ్( Nara Lokesh ) ఏపీలో టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని, సీఎంగా చంద్రబాబు( Chandrababu ) ఉంటారని తెలిపారు.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుభవం లేదని చెబుతూ ఆయన సీఎం క్యాండిడేట్ కాదని స్పష్టం చేశారట.

ఈ వ్యాఖ్యలపై జనసేనలో నిరసన జ్వాల చెలరేగింది.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతర్గత చర్చలు మొదలు అయ్యాయని తెలుస్తోంది.

Advertisement

పార్టీ స్థాపించిన రోజు నుంచి ఇప్పటివరకు పార్టీని అంటి పెట్టుకుని పని చేస్తున్న తమను వాడుకుని వదిలేస్తారా ? అనే భావన జన సైనికుల మదిలో మెదులుతుందని తెలుస్తోంది.ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు తమను వాడుకునేందుకు సరికొత్త మోసానికి తెర తీశారా అనే అనుమానాలు వారిలో కలుగుతున్నాయని సమాచారం.

సాధారణంగా పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఇరు పార్టీలు చర్చించుకున్న తరువాతే ఏదైనా నిర్ణయాన్ని ప్రకటించాలి.అయితే లోకేశ్ ఏకపక్షంగా సీఎం చంద్రమబాబేనని ఎలా ప్రకటిస్తారని జనసేన క్యాడర్ మదనపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే లోకేశ్ ప్రకటనపై జనసైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్యాకేజ్ తీసుకుంటున్నారని, జనసేనను టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారని పలు ఆరోపణలు వస్తున్న అవమానాలను భరిస్తూ వస్తున్న తమను ఈ విధంగా తక్కువగా చూడటం ఏంటని జనసైనికులు భావిస్తున్నారట.ఈ క్రమంలోనే ఇప్పటికైనా తమ పరిస్థితి ఏంటనే దానిపై ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అభిమానంతో ఇన్నేళ్లుగా పని చేస్తున్న తమకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై కూడా క్యాడర్ లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.ఇటీవలే తమను ఉంటే ఉండండి.పొతే పోండి .నా దారి మాత్రం చంద్రబాబు దారి అంటూ తేల్చి చెప్పడంపై పవన్ ఆల్రెడీ అమ్ముడుపోయారా అనే సందేహం మొదలైందంట.అలాగే లోకేశ్ వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే తమకు అసలు టికెట్స్ వస్తాయా? లేదా ? అన్నది కూడా డౌటేనని జనసైనికులు అనుకుంటున్నారని తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )కోసం అవమానాలను ఎదుర్కొని పోరాడుతుంటే ఆయన మాత్రం చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధం అయ్యారా? ఎన్నికల్లో తమకు కూడా చంద్రబాబే సీట్లు కేటాయిస్తాడా? ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అవే తీసుకుని మౌనంగా ఉండాలా అంటూ పలు ప్రశ్నలు జనసైనికుల్లో తలెత్తుతున్నాయని తెలుస్తోంది.పవన్ కల్యాణ్ ను నమ్ముకుని గతంలో దెబ్బతిన్నాం.ఈసారైనా న్యాయం జరుగుతుందని భావిస్తుంటే తమ అధినేత మరోసారి మోసం చేయడానికి సిద్దం అయ్యాడా? అని ఆలోచనలో పడ్డారట.ఈ నేపథ్యంలోనే ఎన్నికల వరకు అయినా పార్టీని నడిపిస్తారా? లేదా చివరాఖరుకు టీడీపీలో విలీనం చేస్తారా అనే అనుమానం సైతం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్రంలో టీడీపీ - జనసేన పొత్తుపై .సీఎం అభ్యర్థిపై జనసేన హైకమాండ్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఇంతవరకు నోరు మెదకపోవడంతో కార్యకర్తలు, అభిమానులు అయోమయానికి గురవుతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు