ఏసీకి అలవాటు పడిపోయారా..? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

ఈమధ్య కాలంలో చాలామంది ఇళ్లలో ఏసీ ఖచ్చితంగా ఉంటుంది.

ఎండాకాలం ( summer )మొదలైనప్పటి నుంచి ఈ అధిక వేడి వల్ల తనని తాను రక్షించుకోవడానికి ఏసీ, కూలర్లని ప్రజలు ఆసరాగా తీసుకుంటున్నారు.

అయితే ఎండ వేడి నుండి రక్షించడానికి ఏసీ చాలా సహకరిస్తుంది.కానీ చాలామంది రోజు మొత్తం ఏసీ లోనే గడుపుతూ ఉంటారు.

ఇక కొంత వేడి ఎదురుకోవాల్సి వచ్చినప్పుడు చాలా బాధకు గురవుతారు.అయితే రోజు ఏసీలో ఉండడం వలన వీరు ఏసీ కి అలవాటు పడిపోతారు.

ఏసీ నుండి కొంతసేపు పక్కకు వచ్చేసినా కూడా వీరు చాలా ఇబ్బందికి గురవుతారు.

Are You Used To Ac But These Health Problems Are Inevitable , Ac, Summer, Physic
Advertisement
Are You Used To AC But These Health Problems Are Inevitable , AC, Summer, Physic

అందుకే ఈ రోజంతా ఏసీలో ఉండడం వల్ల అనేక శారీరక సమస్యలు( Physical problems ) ఎదురవుతాయి.ఆ సమస్యలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఏసీలో ఎక్కువ సమయం గడపడం వలన ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి.

అలాగే ముక్కు, గొంతు సమస్యలు కూడా వస్తాయి.ఎయిర్ కండిషనింగ్ పొడిగా ఉన్నందున గొంతులో పొడిగా ఉంటుంది.

ఇది చాలా చికాకును కూడా కలిగిస్తుంది.ఎక్కువ సమయం ఏసీలోనే( AC ) గడిపితే విపరీతమైన అలసట, బలహీతను కూడా అనుభవించాల్సి వస్తుంది.

అంతేకాకుండా తరచుగా నీరసానికి కూడా గురవుతారు.

Are You Used To Ac But These Health Problems Are Inevitable , Ac, Summer, Physic
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

దీన్ని నివారించడానికి ఏసీ ని తక్కువ చల్లదనంలో వాడుకుంటే చాలా మంచిది.ఏసి వద్ద ఎక్కువ సమయం గడిపే వారికి తలనొప్పి సమస్య( Headache problem ) కూడా ఎదురవుతుంది.ఎందుకంటే ఎయిర్ కండిషనింగ్ కారణంగా గది వాతావరణం పొడిగా మారిపోతుంది.

Advertisement

దీంతో డీహైడ్రేషన్ కి గురై బయటికి వెళ్ళినప్పుడు తలనొప్పి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏసీలో ఎక్కువ సమయం గడిపితే చర్మంపై చెడు ప్రభావం పడుతుంది.

దీనివల్ల చర్మం పొడిగా, దురదగా మారిపోతుంది.దీంతో చర్మంపై చికాకు కలుగుతుంది.

అందుకే ఏసీలో అధికంగా సమయాన్ని గడపకూడదు.

తాజా వార్తలు