ఎక్కువగా తలలో చెమటలు పడుతున్నాయా? అయితే ఇలా చేయండి..!

వేసవికాలం కావడంతో ఎండలు బాగా మండిపోతున్నాయి.అలాగే చెమటలు పట్టడం కూడా చాలా కామన్.

అంతే కాకుండా వేసవిలో తలలో చెమటలు పట్టడం వలన జుట్టు ఊడిపోతుంది.అలాగే చుండ్రు సమస్య( Dandruff ) కూడా వస్తుంది.

ఇలా చెమటలు పడుతుంటే కొన్ని చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షాంపును సరైన సమయంలో వినియోగించాలి.వేసవికాలంలో తలస్నానం ప్రతిరోజు చేయడం చాలా మంచిది.

Advertisement
Are You Sweating Profusely But Do This , Sweating Profusely , Health, Health Tip

ఇక తల స్నానం చేసే సమయంలో తప్పకుండా ఆర్గానిక్ షాంపులను( Organic shampoos ) మాత్రమే వినియోగించాలి.ప్రతిరోజు ఇలాంటి షాంపూలతో స్నానం చేయడం వలన జుట్టుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

అది మాత్రమే కాకుండా చెమట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.అందుకే వేసవిలో ప్రతిరోజు తలస్నానం చేయాలి.

అలాగే రసాయనాలు తక్కువగా ఉన్న షాంపును వాడాలి.ఆపిల్ వెనిగర్( Apple vinegar ) శరీరానికి మేలు చేస్తుంది.

ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.

Are You Sweating Profusely But Do This , Sweating Profusely , Health, Health Tip
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అందుకే ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ వేడి నీటిలో కలుపుకొని తలకు మసాజ్ చేసి 20 నిమిషాలు పాటు వేచి ఉండాలి.ఇక ఆ తర్వాత జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకే కాకుండా మీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Advertisement

ఇక నిమ్మరసంలో కూడా ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది.అందుకే సులభంగా ఇది శరీర బరువును నియంత్రిస్తుంది.

నిమ్మరసం ( lemon juice )కూడా జుట్టుకు చాలా మంచిది.అంతేకాకుండా ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు దుర్వాసన రాకుండా ఉంటుంది.

అయితే ఈ నిమ్మ రసాన్ని జుట్టుకు అప్లై చేయడానికి ఒక నిమ్మకాయను తీసుకొని, వాటి నుంచి రసం తీసి, నీటిలో కలుపుకోవాలి.అందులోనే ఆపిల్ వెనిగర్ వేసి జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి.ఒక 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

ఇలా క్రమం తప్పకుండా తరచూ చేస్తూ ఉండడం వలన వేసవిలో జుట్టు రాలడం లాంటి సమస్యలు దూరం అవుతాయి.ఇక తలలో చెమటలు బాగా వస్తున్నవాళ్లు తలకు ఆయిల్ పెట్టి రోజులు తరబడి అలానే ఉండకూడదు.

తలకు ఆయిల్ రాసిన ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి.అలాంటప్పుడే చెమటలు పట్టవు.

తాజా వార్తలు