ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. అరటిపండును అస్సలు తినకూడదు..!

సీజన్ తో సంబంధం లేకుండా అరటి పండ్లు( Bananas ) ప్రతి సీజన్ లో లభిస్తూ ఉంటాయి.అరటి పండ్లు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి.

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.అరటిపండ్లలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి.

అరటిపండులో పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి.అరటి పండ్లను తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ అరటిపండును తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన అనేక రకాల సమస్యలు రాకుండా ఉంటాయి.

Advertisement

ఎముకలు దృఢంగా, బలంగా( Bones firm , strong ) తయారవుతాయి.వీటిలో ఉండే క్యాల్షియం ( Calcium )ఎముకల సాంద్రతను కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే దీనిలో ఉండే ఫైబర్స్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.అందువల్ల మనం ఇతర ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటాము.

మన శరీర బరువు అదుపులో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే అరటి పండును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును( blood pressure ) అదుపులో ఉంచడంతోపాటు గుండె కొట్టుకునే వేగాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట అరటి పండ్లను తినడం వల్ల శరీరక శ్రమ తగ్గి చక్కటి నిద్ర పడుతుంది.నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అంతేకాకుండా కొందరు మాత్రం అరటిపండును ఎక్కువగా తీసుకోకూడదు.

Advertisement

శ్వాస సమస్యలతో బాధపడేవారు, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు.అరటిపండును తక్కువగా తీసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే సైనస్ సమస్యతో బాధపడేవారు, ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా తయారయ్యే వారు అరటిపండును తక్కువగా తీసుకుంటూ ఉండాలి.అరటిపండు ఆరోగ్యానికి మేలు చేసేది అయినప్పటికీ ఈ సమస్యలతో బాధపడేవారు దీనిని తక్కువగా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు