ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

సాధారణంగా వయసుకు వచ్చిన ప్రతి స్త్రీ కూడా ఎదుర్కొనే సమస్య రుతుక్రమణం.ఈ సమయం చాలామంది స్త్రీలకు కష్టంగా ఉంటుంది.

అయితే కొంతమందికి సాఫీగా జరిగితే, మరి కొంతమందికి ఎన్నో అనారోగ్య సమస్యలను( Health problems ) తెచ్చిపెడుతుంది.దాంతో వారు చాలా ఇబ్బంది పడుతుంటారు.

ఇక కొంతమందికి పీరియడ్స్ ఇరెగ్యులర్( Periods are irregular ) గా వస్తూ ఉంటాయి.ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అధిక బరువుకి కారణమవుతూ ఉంటుంది.

అయితే ఈ సమస్యను మొదట్లోనే గమనించి, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది.అలా కాకుండా దీన్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

పిల్లలు కాకపోవడం, గర్భంలో నీటి బుడగలు, సిఓఎస్, పిసిఓడి లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే మనం నెలసరి రెగ్యులర్ చేసుకోవడం కోసం మనం సాధారణంగా తినే ఆహారాలు సక్రమంగా తీసుకోవాలి.అప్పుడే మంచి ఉపశమనం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు.

అయితే ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రుతుక్రమణ సమయంలో అధిక స్రావంతో బాధపడుతుంటే పసుపు పాలను( Turmeric milk ) తాగడం చాలా మంచిది.

ఎందుకంటే ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పాలలో ఉన్న క్యాల్షియం అధిక రక్తస్రావం కాకుండా అడ్డుపడుతుంది.

ఇక ఇరెగ్యులర్ పీరియడ్ తో బాధపడుతున్న వారు తరచూ బీట్రూట్,( Beetroot ) కొత్తిమీరతో చేసిన జ్యూస్ లను తాగడం వలన ఇందులో ఉండే ఫోలిక్ యా, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభించి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.రుతుక్రమణం సమయంలో దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం వలన అధిక రక్తస్రావం కాకుండా ఆ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి.ఇక విటమిన్ సి అధికంగా ఉన్న ఆరెంజ్, జామా, నిమ్మ లాంటి పండ్లను తీసుకోవడం వలన పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు