బిపి ఎక్కువగా ఉందా? అయితే 7 పదార్ధాలు తింటూ ఉండండి బిపి కంట్రోల్ లో ఉంటుంది

ఈ రోజుల్లో బిజీ జీవనశైలి,సరైన ఆహారం తినకపోవడం,మసాలాలు ఎక్కువగా తినటం,పచ్చళ్లు అధికంగా తినడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళన, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోనే బిపి వచ్చేస్తుంది.

బీపీని కంట్రోల్ చేయటానికి ఇంగ్లిష్ మందులు వాడకుండా ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే సహజమైన పదార్ధాలతో ఎలా కంట్రోల్ చేయవచ్చో తెలుసుకుందాం.

ద్రాక్ష ద్రాక్షలో పొటాషియం,పాస్పరస్ సమృద్ధిగా ఉండుట వలన హై బీపీని తగ్గించటంలో సహాయపడతాయి.పొటాషియం సహజసిద్ధమైన డైయూరిటిక్ కావటం వలన కిడ్నీలో వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతాయి.

ముఖ్యంగా సోడియం బయటకు వెళ్ళిపోతుంది.దాంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బిపి కూడా తగ్గుతుంది.

టమాటా టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది.ఇవి బీపీని తగ్గిస్తాయి.

Advertisement

రక్త నాళాల్లో కొవ్వు చేరకుండా చూడటంతో రక్త సరఫరాకు ఆటంకం లేకుండా ఉంటుంది.వెల్లుల్లి బీపీని తగ్గించడంలో వెల్లుల్లి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఇది డైయూరిటిక్ కూడా.దీంతో కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

గుండె సమస్యలు రావు.ప్రతి రోజు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

నీరు బీపీ తగ్గాలంటే శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి.అందుకని ప్రతి రోజు తప్పకుండా 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా త్రాగాలి.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

దీంతో బీపీని కొంత వరకు అదుపు చేయవచ్చు.బీట్‌రూట్ బీట్‌రూట్ తరచూ ఆహారంలో భాగంగా తింటుంటే బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.

Advertisement

బీట్ రూట్ లో రక్త సరఫరాను మెరుగు పరిచే లక్షణాలు ఉన్నాయి.డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్‌లో పాలీ ఫినాల్స్, ఫ్లెవనాయిడ్స్, క్యాథెచిన్స్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఇవి బీపీని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి.

అరటి పండ్లు అరటి పండ్లను తరచూ తింటుంటే బీపీ సమస్య పెద్దగా భాదించదు.ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన బీపీ ఇట్టే తగ్గిపోతుంది.

అంతేకాకుండా ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.రక్త సరఫరా మెరుగు పడుతుంది.

చూసారుగా ఫ్రెండ్స్ వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బిపి సమస్య నుండి బయట పడవచ్చు.

తాజా వార్తలు