అప్పులతో బాధపడుతున్నారా..? అయితే అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేయండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది.

తిండికి, పిల్లల చదువులకు, ఉద్యోగాలకు అనారోగ్య సమస్యలకు ఇలా ప్రతి విషయాన్ని కూడా డబ్బు చాలా అవసరం వస్తుంది.అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాలవల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది.

కానీ ఆ అప్పులు తీరడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు.అలాగే భగవంతుడిని వేడుకుంటూ ఎన్నో పరిహారాలని కూడా పాటిస్తూ ఉంటారు.

అయినప్పటికీ కొంతమందికి ఎలాంటి ప్రయోజనాలు కలగవు.అయితే డబ్బు బాధలు పోవాలంటే ప్రతి రోజు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి.

Advertisement

అయితే పూజ అనేది మన దినచర్యలో భాగం కావాలి.తరచూ శ్రీ మహాలక్ష్మికి( Shri Mahalakshmi ) కుంకుమ అర్చన చేయాలి.

ఇలా చేయడం వలన మేలు జరుగుతుంది.అలాగే కనకధారా స్తోత్రం ఎల్లప్పుడూ పాటించాలి.

ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన, విశిష్టమైన, శక్తివంతమైన స్తోత్రం.దీన్ని ఎల్లప్పుడూ పట్టించడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

అయితే ఏప్రిల్ 20వ తేదీన అమావాస్య రాబోతుంది.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్28, సోమవారం 2024

అందుకే ఆరోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి.అయితే అమావాస్య రోజున సాయంత్రం ఏడు నుంచి 10 గంటల లోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి.ఆ తర్వాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం ఏదో చిన్న విగ్రహం తీసుకోవాలి.

Advertisement

ఒక ప్లేట్ లో లేదా తమలపాకులో అయినా దాన్ని ఉంచాలి.అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః.అని మనసులో 108 సార్లు అనుకుంటూ చెరుకు రసంతో అభిషేకం చేయాలి.

ఒక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి.ఇలా అమావాస్య రోజు చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాపిస్తాయి.

మీకున్న అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.అలాగే ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరిగి కష్టాలన్నీ తీరిపోతాయి.

అయితే ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తితో చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.

తాజా వార్తలు