మీరు రాత్రి సమయంలో భోజనం మానేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

మనం జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం అస్సలు మర్చిపోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది శరీర పోషణకు, అభివృద్ధికి చాలా ముఖ్యం.

చాలామంది రాత్రి భోజనం( dinner ) చేయకుండానే నిద్రకూ ఉపక్రమిస్తున్నప్పటికీ దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.తీరిక లేకుండా పనిచేసే వ్యక్తి రాత్రి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత చాలా అలసిపోతాడు.

అతను పడుకున్న వెంటనే నిద్రపోతాడు.అయితే రాత్రి భోజనం చేయకపోతే బరువు తగ్గుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.

అయితే అలా చేస్తూనే ఎక్కడో ఒక చోట నష్టం జరుగుతూ ఉంటుంది.రాత్రి భోజనం మానేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Are You Skipping Meals At Night But These Problems Are Inevitable , Dinner, Pro
Advertisement
Are You Skipping Meals At Night But These Problems Are Inevitable , Dinner, Pro

రాత్రి సమయంలో ఆహారం తీసుకోకపోతే అది మీ బరువును తగ్గిస్తుందని అపోహ చాలా మందిలో ఉంది.ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకల లోపం ఏర్పడుతుంది.అంటే మనం పోషకాహార లోపానికి గురవుతాము.

దాని ప్రభావం మన శరీర పని తీరుపై ఖచ్చితంగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో మీరు బలహీనంగా కనిపించవచ్చు.

రక్తహీనతను ( Anemia )ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే వంట చేసే బద్ధకం వల్ల రాత్రి భోజనం చేయకపోతే అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

శరీరక శ్రమ లేకపోవడం కూడా సరైనది కాదు.అటువంటి పరిస్థితిలో నిద్రలో శక్తి లేకపోవడం మరుసటి రోజు కూడా మీరు బలహీనత, అలసట( Weakness, fatigue ) వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది.

Are You Skipping Meals At Night But These Problems Are Inevitable , Dinner, Pro
న్యూస్ రౌండప్ టాప్ 20

మీరు రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోతే, మీకు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆకలిగా అనిపిస్తుంది.దీని కారణంగా మీరు ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర పొందలేరు.దీని కారణంగా మరుసటి రోజు నీరసం, అలసటగా అనిపిస్తూ ఉంటుంది.

Advertisement

అందుకే రాత్రిపూట భోజనం చేయకుండా అస్సలు నిద్రపోకూడదు.

తాజా వార్తలు