ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదిలేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే...

నేటి సమాజంలో ఎక్కువగా ఉద్యోగులు ఉదయం సమయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా అలాగే ఉండిపోతున్నారు.

మరికొంతమంది ఎక్కువగా బరువు పెరుగుతుండడం వల్ల బ్రేక్ ఫాస్ట్ ని తినకుండా వదిలేస్తున్నారు.

డైటింగ్ చేసేవారు చాలా తక్కువ తినడం లాంటి పనులు కూడా చేస్తున్నారు.అయితే ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ ని తినకపోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది .అలానే మైగ్రేన్ సమస్య కూడా రావచ్చు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు.

Advertisement

ఎందుకంటే ఇలా తినకపోవడం వల్ల ఆ వ్యక్తి ఎక్కువగా ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది.కాబట్టి ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను నిద్రలేచిన వెంటనే సమయం చూసుకుని తింటే మంచిది.

భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువగా సమయం తీసుకోవడం వల్ల మానవ శరీరంలో క్యాల్షియం లోపం వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే హిమోగ్లోబిన్ లోపం కూడా రావచ్చు అని చెబుతున్నారు.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం తీసుకునే ఫలహారం అస్సలు వదలకుండా తినాలి.

బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య కూడా కలుగుతుంది.బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల ఆరోగ్యానికి చెడు చేసే విధంగా బరువు కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెప్పారు.కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని ప్రతిరోజు ఉదయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినడం మంచిది.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు