స్మార్ట్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటున్నారా.. అయితే మీరు అతిపెద్ద ప్రమాదంలో పడినట్లే..?

మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్‌( Smart phone ) ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది.

ఒక పూట తినకుండా అయినా అంటున్నారు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే అసలు ఉండలేకపోతున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే మనిషి స్మార్ట్ ఫోన్ కు బానిస అయ్యాడని కచ్చితంగా చెప్పవచ్చు.పక్కన ఉన్న వ్యక్తులను కూడా పట్టించుకోవడం లేదు.

నిత్యం సోషల్ మీడియాలో ప్రస్తుత సమాజంలోని ప్రజలు ఉంటున్నారు.స్మార్ట్ ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితులు వచ్చాయి.

అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు స్మార్ట్ ఫోన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి.

Advertisement

అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి.స్మార్ట్ ఫోన్‌ లో పనులన్నీ సులభంగా మారిపోయాయి అని సంతోషించాల దానితో వస్తున్న ఆరోగ్య సమస్యలను చూసి బాధపడాలా తెలియని పరిస్థితి ఏర్పడింది.ఎన్నో రకాల మానసిక, శరీరక సమస్యలకు కారణంగా స్మార్ట్ ఫోన్‌ మారిపోయింది.

ఈ స్మార్ట్ ఫోన్‌ రేడియేషన్( Phone radiation ) ద్వారా ఆరోగ్యం పై దుష్ప్రభావం పడుతుందని చాలామందికి తెలుసు.అయితే స్మార్ట్ ఫోన్‌ సంతానలేమికి కూడా కారణంగా మారుతోందని చాలామందికి తెలియదు.

అవును మీరు చదువుతుంది నిజమే.మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మీ స్మార్ట్ ఫోన్ మీకు శత్రువుగా మారుతుంది.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకుంటే ఈ ప్రమాదం మరీ ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

రేడియేషన్, వేడి మగవారి శుక్ర కణాల ఉత్పత్తిపై ఇది చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఫోన్ ప్యాంటు ముందు ప్యాకెట్ లో పెట్టుకుంటే శుక్రకణాల( Sperms ) సంఖ్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాయి.మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే వేడి మగవారి సంతాన సామర్థ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలా అధ్యయాలలో వెల్లడింది.

Advertisement

మొబైల్ ఫోన్లకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయ్యే కొందరినీ పరిగణలోకి తీసుకొని వారిపై జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.కేవలం స్మార్ట్ ఫోన్‌ నుంచి వచ్చే వేడి మాత్రమే కాకుండా నెట్వర్క్ సిగ్నల్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా స్పెర్మ్‌ కౌంట్ పై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తలు