జ‌గ‌న్ కేబినెట్‌లో అంత‌మందిని మార్చ‌బోతున్నారా.. పెద్ద లిస్టే ఉందే

వైసీపీని కొన్ని నెల‌లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది కేబినెట్‌లో మార్పు అనే చెప్పాలి.ఎమ్మెల్యేలు మొత్తం దీనిపైనే దృష్టి పెట్టారు.

నాకు అంటే నాకే మంత్రి ప‌ద‌వి వ‌స్తుందంటూ ఆశ‌లు పెట్టుకుంటున్నారు.ఇందులో భాగంగా అధినేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.

కొంద‌రు అయితే ఏకంగా జ‌గ‌న్‌కు గుడి క‌ట్ట‌డాన్ని కూడా మ‌నం చూస్తున్నాం.ఇంకొంద‌రు త‌మ సామాజిక వ‌ర్గాల ఆధారంగా లెక్క‌లు వేసుకుంటున్నారు.

అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్టత రాలేదు.కానీ జ‌గ‌న్ మాత్రం సీఎం అయిన తొలినాళ్ల‌లోనే రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం కేబినెట్ ను మార్చేస్తానంటూ చెప్పేశారు.

Advertisement
Are You Going To Change The Last One In Jagan's Cabinet There Is A Big List, Ja

జ‌గ‌న్ మాట ప్ర‌కారం ఈ నెల 30తో స‌రిగ్గా జగన్ సర్కారు ఏర్ప‌డి రెండున్నరేళ్లు గ‌డిచిపోతాయి కాబ‌ట్టి ఈ వార్త‌లు మ‌రింత ఊపందుకున్నాయి.అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఉన్న కేబినెట్ లో చాలా మందిని మార్చేస్తార‌ని తెలుస్తోంది.

కొంద‌రు మంత్రులు అయితే స్వ‌యంగా వారే చెబుతున్నారు.త‌మకు మంత్రి ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని జ‌గ‌న్ ఏ బాధ్య‌త ఇచ్చినా చేస్తామంటూ చెప్పేస్తున్నారు.

Are You Going To Change The Last One In Jagans Cabinet There Is A Big List, Ja

ఇక ఇలా ప్ర‌చారంలో ఉన్న వారిలో మొద‌ట ఈ లిస్టు ఉందంటూ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.ఈ మంత్రుల్లో ఎక్కువ‌గా వెలంపల్లిశ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, రంగనాథరాజు లాంటి వారి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.వీరితో పాటు మ‌రికొంద‌రి పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి.

అయితే ఇది ఫైన‌ల్ లిస్టు కాక‌పోయినా జ‌గ‌న్ మాత్రం వీరి మీద పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేద‌ని తెలుస్తోంది.ఏదేమైనా మ‌రి కొద్ది రోజుల్లో మంత్రి వ‌ర్గాన్ని పూర్తి స్థాయిలో మార్చేయ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే సంకేతాలు కూడా వెళ్లాయంట‌.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు