నానాటికీ క్షీణిస్తున్న రూపాయి... కారణాలు ఇవేనా?

అవును, రూపాయి తాజాగా రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థాయికి పడిపోతుంది.అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.

2625 వద్ద ట్రేడవుతున్నట్టు భోగట్టా.దానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) చర్యలు తీసుకోనుందని నిపుణులమాట.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్‌లో జోక్యం చేసుకోక తప్పదని అన్నారు.

Advertisement

ఇకపోతే రూపాయి( Rupee ) మారకపు విలువ నానాటికీ కనిష్ఠ స్థాయికి దిగజారిపోతుంది.దాంతో దేశీయంగా ఉన్న డాలర్‌ రిజర్వ్‌ లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారని స్పస్టమౌతోంది.ఆర్‌బీఐ ( RBI )వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు.

ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు.అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది.రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్‌బీఐ జోక్యం చేసుకుని.అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక భారత రూపాయి ( Indian Rupee )కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తే అనేక విషయాలు మనకు బోధపడతాయి.భారత కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు అని నిపుణులు అంటున్నారు.ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరిందని సమాచారం.

ఇందువల్ల దిగుమతుల బిల్లు కూడా పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.అదేవిధంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

ఇంకా ఇజ్రాయెల్‌ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనబడడం లేదు.

Advertisement

తాజా వార్తలు