జగన్ అవినాష్ లపై పోటీకి ఈ సిస్టర్స్ రెడీనా ?

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలు రసవత్తరం గానే ఉండబోతున్నాయి.

అధికార పార్టీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు మిగిలిన అన్ని పార్టీలు రకరకాల వ్యూహాలను రచిస్తూ, వచ్చే ఎన్నికల్లో వైసిపికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒకవైపు రాజకీయంగా జగన్( CM ys jagan ) అన్ని పార్టీల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండగానే, సొంత కుటుంబం నుంచి రాజకీయంగా మొదలైన తలనొప్పులు మరింత చికాకు కలిగిస్తున్నాయి.ఇది ఎలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సునీత , షర్మిలలు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడం వంటివి మరింత ఆందోళన కలిగిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయబోతుండగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి దివంగత వైస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Are These Sisters Ready To Compete Against Jagan Avinash , Ys Avinash Reddy, Pu

అలాగే జగన్ పోటీ చేయబోయే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైస్ షర్మిల( Sharmila ) పోటీ చేసే ఆలోచనతో ఉన్నారట.కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సునీత పోటీ చేస్తే అన్ని తాను చూసుకుంటానని షర్మిల భరోసా ఇచ్చినట్లు సమాచారం. వైస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంలో వైస్ అవినాష్ రెడ్డి( YS Vivekananda Reddy ) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Are These Sisters Ready To Compete Against Jagan Avinash , Ys Avinash Reddy, Pu

తన తండ్రి హత్యా కు కారణం అవినాష్ అంటూ సునీత పదేపదే విమర్శలు చేయడం, కోర్టులో కేసులు వేయడం వంటివి చేస్తున్నారు.

Are These Sisters Ready To Compete Against Jagan Avinash , Ys Avinash Reddy, Pu

తన తండ్రిని చంపిన వారిని ఓటు ద్వారా శిక్షించి తనకు న్యాయం చేయాలని సునీత ప్రచారం చేపట్టేందుకు సునీత సిద్ధం అవుతున్నారు.అందుకే అవినాష్ రెడ్డి పై పోటీకి నిలబడాలని నిర్ణయించుకున్నారట.కచ్చితంగా సానుభూతి ఓట్లు తమకు కలిసి వస్తాయని సునీత లెక్కలు వేసుకుంటున్నారు.

వైసీపీలోని అసంతృప్త నాయకులు పులివెందుల, కడప పార్లమెంటు నియోజకవర్గాల్లో తమకు మద్దతుగా నిలబడతారని సునీత, షర్మిలలు అంచనా వేసుకుంటున్నారట.అందుకే తమ అన్నదమ్ములపై తామే పోటీకి సై అంటున్నారు ఈ సిస్టర్స్.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు