అరటి పువ్వును వారానికి రెండుసార్లు తీసుకుంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ఆయుర్వేద నిపుణుల ప్రకారం ప్రకృతిలో ఎన్నో మొక్కలు అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఉపయోగించవచ్చు.

కానీ ఎలాంటి వ్యాధికి ఏ మొక్కను ఉపయోగించాలో కచ్చితంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప కానుకలలో అరటి పువ్వు( Banana flower) ఒకటి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే వారానికి రెండు సార్లు అరటి పువ్వు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే అరటి పువ్వును వారానికి రెండుసార్లు తింటే రక్తనాళాలలో పేరుకో పోయిన కొవ్వు కరిగి రక్తం శుభ్రం అవుతుందని చెబుతున్నారు.అంతే కాకుండా అరటి పువ్వులోని ఆస్ట్రింజెంట్ గుణాలు రక్తంలో అదనపు చెక్కరను కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

ప్రస్తుత రోజులలో ఆహారపు మార్పులు, మానసిక ఒత్తిడి( Stress ) వల్ల పోట్టలో అధిక గ్యాస్ ఏర్పడి పొట్టలో అల్సర్లు ఏర్పడుతూ ఉన్నాయి.

Advertisement

ఈ అల్సర్లు నయం కావాలంటే అరటి పువ్వును వారానికి రెండు సార్లు తింటే పొట్ట లోని అల్సర్ల సమస్యలు దూరం అయిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఇలా వారానికి రెండు సార్లు అరటి పువ్వులు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి ( Digestive System )కూడా పెరుగుతుంది.అరటి పువ్వు హెమోరాయిడ్స్ కారణంగా అంతర్గత బాహ్య అల్సర్లకు అద్భుతమైన నివారణగా ఉపయోగించవచ్చు.

అరటి పువ్వును ఆహారంలో చేర్చుకుంటే అధిక రక్తస్రావం, బహిష్టు సమయంలో తెల్ల పడడం వంటి వ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఈ పువ్వును వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అలాగే ఏ ఆహార పదార్ధమైన ఆరోగ్యానికి మంచిదని అతిగా తీసుకోకూడదు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు