ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి చూపిస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ వైయస్సార్‌సీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ( YS Jaganmohan Reddy )ధ్వజమెత్తారు.

తాజాగా తల్లికి వందనం చేస్తూ, ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఆయన సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు.

ఇక ఆ సందేశంలో ఏముందంటే.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ పలు ప్రశ్నలను సంధించారు.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారని అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని ఆయన అన్నారు.వరుసగా కేబినెట్‌ సమావేశాలు ( Cabinet meetings )జరుగుతున్నా కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదంటూ తెలిపారు.

చివరికి ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్ లో తేల్చిచెప్పేశారని, ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదని, ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు.అన్నారని తెలిపారు.ఇద్దరుంటే రూ.30వేలు.ముగ్గురు ఉంటే రూ.45వేలు.నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారని తెలిపారు.ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయని, వైయస్సార్‌సీపీ హయాంలో( YSRCP ) 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారని అన్నారు.చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి.

ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారన్నారు.ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి.

Advertisement
Are The Promises Given To The People So Bare, Jagan Mohan Reddy, Are The, Promi

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారూ అంటూ మంది పడ్డారు.

Are The Promises Given To The People So Bare, Jagan Mohan Reddy, Are The, Promi

అలాగే, రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని.ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారన్నారు.అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదని జగన్ అన్నారు.అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు అందించామని అన్నారు.కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ.రబీ కూడా అయిపోయింది.

ఒక్కపైసా ఇవ్వలేదని అన్నారు.ఇన్ని కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదని, ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యం చేశారన్నారు.సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదని ప్రభుత్వం పై జగన్ విమర్శించారు.

ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది కూడా మోసమే అని అన్నారు.ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోందని, ప్రతి అడుగులోనూ స్కాంలే అంటూ.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదని జగన్ ( Jagan )అన్నారు.రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయని, ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయని జగన్ అన్నారు.

Advertisement

ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుందని, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుందని జగన్ సుదీర్ఘ పోస్టులో అన్నారు.

తాజా వార్తలు