తెలంగాణ ఎలక్షన్స్ ఏపీలో హడావిడి !

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల( Telangana Elections) వేడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

రేపటితో ఎన్నికలు కూడా పూర్తి అవుతుండడంతో ఇక అందరి దృష్టి డిసెంబర్ 3 పైనే ఉంటుంది.

అయితే తెలంగాణ ఎన్నికల వేళ ఏపీలో కూడా రాజకీయాలు వేడెక్కాయి.అక్కడ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికి పార్టీలు మాత్రం ఇప్పుడే ఎలక్షన్స్ అన్న రీతిలో హడావిడి చేస్తున్నాయి.

దీనికి కారణం కూడా లేకపోలేదు.ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్టోరల్ అధికారులను నియమించింది ఎన్నికల కమిషన్ దీంతో ఎన్నికలు అతి త్వరలోనే జరగనున్నాయని ప్రధాన పార్టీలు ఓ అంచనాకు వచ్చేశాయి.

అందుకే అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రజల్లో ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నాయి.ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) సాధికార యాత్ర పేరుతో ఆల్రెడీ పార్టీ నేతలను ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు.అటు టీడీపీ కూడా చంద్రబాబు( Chandrababu naidu )కు పూర్తి స్థాయి బెయిల్ రావడంతో ఇక ఆలస్యం చేయకుండా ప్రజలతో మమేకం అయ్యేందుకు వ్యూహరచన చేస్తోంది.

Advertisement

కాగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే.ఏప్రెల్ లో ఎన్నికల నోటిఫికేషన్ మేలో ఎలక్షన్స్ అని మరికొందరు చెబుతున్నారు.

దీంతో ఏపీ ఎలక్షన్స్ పై చిన్నపాటి కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.అయితే ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇంకా ఎలాంటి తేదీ కన్ఫర్మ్ చేయనప్పటికి పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దమౌతున్నాయి.ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన కూటమి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

రెండోసారి అధికారం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే.జగన్ అరాచక పాలనకు చెక్ పెట్టాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి.

దీంతో ఏపీ రాజకీయాలు ఇప్పటి నుంచే హాట్ హాట్ గా సాగుతున్నాయి.మరి ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయంగా చెప్పవచ్చు.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు