ప్రభాస్-సుకుమార్ ప్రాజెక్ట్ పై క్లారిటీ.. అఫిషియల్ అనౌన్స్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన విషయం విదితమే.ఈ సినిమా తర్వాత ఈయన స్థాయి ఒక్కసారిగా పెరిగి పోయింది.

బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి తన స్టామినా బాలీవుడ్ లో చూపించాడు.ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.

ఇక ఈయన ప్రెజెంట్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.ఈయన సినిమాల అప్డేట్ వస్తుంది అంటే అంతా అలెర్ట్ అయిపోతారు.

ప్రెజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.ఒక్కో సినిమాకు ఒక్కో రకం అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Advertisement
Are Prabhas And Sukumar Teaming Up, Sukumar, Prabhas, Project K , Salaar, Abhis

ఈ సినిమాలే కాకుండా మారుతి సినిమా, ఇంకా సురేందర్ రెడ్డితో స్పిరిట్ సినిమా కూడా ప్రకటించాడు.ఇలా అనేక భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు క్షణం తీరిక లేదు.

Are Prabhas And Sukumar Teaming Up, Sukumar, Prabhas, project K , Salaar, Abhis

అయినా సరే ఈయన తర్వాత చేయబోయే సినిమాలపై ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.మరి తాజాగా నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.ఈయన లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రుష్ప వంటి సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.దీంతో వీరిద్దరి కాంబో అనేసరికి అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఈ నిర్మాణ సంస్థ ఖండించింది.

వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి వార్తలను నమ్మవద్దు అని అఫిషియల్ గా సెన్సేషనల్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్న వారికీ నిరాశ ఎదురైంది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు