బీజేపీని ఒక కులానికి క‌ట్టేస్తున్నారా..  ఏపీలో సీన్ రివ‌ర్స్ ?

రాష్ట్రంలో బీజేపీని ప‌ట్టుబ‌ట్టి గాలి కొట్ట‌యినా.పెద్ద‌ది చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్న ఆ పార్టీ రాష్ట్ర నాయ‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో రెండు ప్ర‌ధాన పార్టీలు.

రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తు న్న నేప‌థ్యంలో ఎటూ కాకుండాపోయిన కాపుల‌ను తాము చేర‌దీయాల‌ని బీజేపీ భావిస్తోంది.ఈ విష‌యం.

పైస్థాయిలో చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.అయితే.

Advertisement
Are Bjp Tying To One Caste Kapu Scene Reverse In AP,ap,ap Political News,bjp,mud

దీనిపై ఎలాంటి క్లారిటీ లేకున్నా.బీజేపీని ఒక కులానికి క‌ట్టేయాల‌నే వ్యూహాన్ని మాత్రం పెద్ద‌లు ఒప్పుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఎందుకంటే.బీజేపీ ఒక జాతీయ పార్టీ.

ముఖ్యంగా హిందూ సామాజిక వ‌ర్గాన్ని ల‌క్ష్యం చేసుకుని ముందుకు సాగుతున్న పార్టీ.అందుకే కేవ‌లం కులాల వారీగా బీజేపీని డెవ‌లప్ చేయాల‌ని పార్టీ నాయ‌కులు ఎప్పుడూ భావించ‌లేదు.

కానీ, దీనికి విరుద్ధంగా కాపుల‌కు మాత్ర‌మే బీజేపీని ప‌రిమితం చేయాల‌ని రాష్ట్ర నాయ‌కులు భావిస్తున్నారు.ముఖ్యంగా పార్టీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు ఇదేదిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే.

Are Bjp Tying To One Caste Kapu Scene Reverse In Ap,ap,ap Political News,bjp,mud
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?

ఈ క్రమంలోనే కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ను క‌లిశారు.ఆయ‌న పార్టీలోకి వ‌చ్చేందుకు దా దాపు అంగీక‌రించారు.అయితే.

Advertisement

ముద్ర‌గ‌డ వెంట సాధార‌ణంగానే కాపు నాయ‌కులు.ఆ స‌మాజం రావ‌డం త‌థ్యం.

కానీ, ఇదే జ‌రిగితే.బీజేపీ కేవ‌లం ఒక కులానికి ప‌రిమిత‌మ‌వుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ బీజేపీ సీనియ‌ర్లు.ముద్ర‌గ‌డ వ‌చ్చేందుకు అడ్డు చెబుతున్నార‌ని.అంటున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.ఇక‌, దీనిపై రాష్ట్రంలోని కీల‌క నాయ‌కులుగాఉన్న జీవీఎల్ న‌ర‌సింహారావు, పురందేశ్వ‌రి వంటివారు సైతం మౌనంగా ఉన్నారు.

ముద్ర‌గ‌డ విష‌యంలో అనుస‌రించే పంథాను ఎవ‌రూ చెప్ప‌లేక పోతుండ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు