సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత మరియు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి .
ఈనెల 28 వరకు మధ్యంతర బెల్ లో ఉన్న షరతులు వర్తిస్తాయని 29 తర్వాత రాజకీయపరమైన సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అంటూ ఏపీ హైకోర్టు( AP High Court ) అనుమతినిచ్చింది.
ఈ కేసులో విచారణ మొదలైన 22 నెలల వరకూ చంద్రబాబు బయటే ఉన్నారని, ఆ సమయంలో సాక్షులను ప్రభావితం చేశారు అనడానికి ప్రాదమికఆధారాలు లేవు అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా అత్యున్నత భద్రత మధ్య ఉన్న చంద్రబాబు కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేదని కూడా హైకోర్టు అభిప్రాయపడింది . సిమెన్స్ డైరెక్టర్ మరియు డిజైన్ టెక్ యజమాని ( Siemens Director and Owner of Design Tech )వాట్సాప్ చాట్ లకు చంద్రబాబుకి సంబంధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.దాంతో గ్రహణం వీడిన చంద్రుడిలా తమ నేత చంద్రబాబు బయటకు వచ్చినట్లయ్యింది అని టిడిపి( TDP ) శ్రేణులు సంభరాలు చేసుకుంటున్నాయి .నిజానికి ఎన్నికలు దగ్గరకు వచ్చిన ఈ ప్రస్తుత తరుణంలో ఈ ఆరు నెలల కాలం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు అత్యంత అమూల్యమైనది ఎన్నికల సన్నద్ధతకు,ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ రూపొందించుకోవాల్సిన సమయం, పైగా జనసేనతో పొత్తును కూడా ప్రకటించి ఉండడంతో సీట్ల సర్దుబాటు, అసంతృప్తులను బుజ్జగించడం వంటి కీలకమైన దశను ఆ పార్టీ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
ఇలాంటి కీలక సమయంలో చంద్రబాబు జైలులోనే ఉండి ఉంటే ఆ పార్టీకి నిర్వహణ చాలా కష్టమై ఉండేది.అందువల్ల ఇప్పుడు దొరికిన బెయిల్ ఆ పార్టీకి ఆక్సిజన్ లాంటిదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.సరైన సమయంలో చంద్రబాబు విడుదలవడంతో ఇక పూర్తిస్థాయిలో రాజకీయ వ్యవహారాలను నడిపిస్తారని, వాయువేగంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది .మరి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిన తర్వాత దొరికిన ఈ సమయాన్ని రెట్టింపు పట్టుదలతో చంద్రబాబు ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy