Aravind Kejriwal Satyendra Jain : గుజరాత్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్..!!

డిసెంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం తెలిసిందే.

ఎప్పటినుండో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తూ ఉంది.కానీ ఈసారి మాత్రం గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు వస్తున్నాయి.

మరో పక్క ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతూ ఉంది.

ఇదిలా ఉంటే గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత లేటెస్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.గుజరాత్ ఎన్నికల నుండి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

అలా చేస్తే అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మనీష్ షిపోడియాతోపాటు సత్యేంద్ర జైన్ లను కేసుల నుండి తప్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు.అది కూడా తన సొంత పార్టీల నేతలు నుండే ఈ ఆఫర్ పంపించినట్లు పేర్కొన్నారు.

దీంతో కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు గుజరాత్ మరియు జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Advertisement