నిరుద్యోగులకు శుభవార్త ... ఐదు నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సి రికార్డు స్థాయిలో ఐదు నోటిఫికేషన్ లను ఈ రోజు విడుదల చేసింది.

ఈ ఐదు నోటిఫికేషన్ ల ద్వారా.

మొత్తం 550 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.జారీ అయిన నోటిఫికేషన్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 330, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 100, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్లు 50 ఉన్నాయి.

వీటితో పాటు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్లు 29, గిరిజన, బీజీ సంక్షేమశాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 28, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లో 18 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఫిబ్రవరి 20నుంచి మార్చి 13వరకు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఫిబ్రవరి 27నుంచి మార్చి 20 వరకు, అటవీశాఖ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.కమిషన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement