ఈ జెల్‌ను వారంలో ఒక్క‌సారి జుట్టుకు రాశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అన‌రు!

హెయిర్ ఫాల్‌.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని మ‌ద‌న పెడుతున్న స‌మ‌స్య ఇది.వ‌య‌సు పైబ‌డిన త‌ర్వాత హెయిర్ ఫాల్ వేధిస్తున్నా.

పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు.

కానీ, యంగ్ ఏజ్‌లోనే జుట్టు విప‌రీతంగా రాలుతుంటే ఏం చేయాలో తెలియ‌క తెగ క‌ల‌వ‌ర ప‌డిపోతూ ఉంటారు.అందులోనూ పెళ్లికాని యువ‌తీ, యువ‌క‌ల ప‌రిస్థితి వ‌ర్ణ‌ణాతీతం అనే చెప్పాలి.

ఒకవేళ మీరు ఈ జాబితాలో ఉంటే.అస్స‌లు చింతించ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హోం మేడ్ జెల్ మీ హెయిర్ ఫాల్ కు సుల‌భంగా అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌దు.మ‌రి ఇంత‌కీ ఆ హెయిర్ జెల్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మ‌రియు ఏ విధంగా వాడాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కుకుంబ‌ర్ జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ జెల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.

ఈ జెల్ ను వాడేట‌ప్పుడు హెయిర్‌కు ఆయిల్ లేకుండా చూసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ జెల్‌ను అప్లై చేసుకుని.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అన‌రు.అవును, అలోవెర జెల్‌, కుకుంబ‌ర్ జెల్‌, ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ప‌లు సుగుణాలు కుదుళ్ల‌ను బ‌లంగా మార్చి.

జుట్టు రాల‌డానికి అడ్డు క‌ట్ట వేస్తాయి.అదే స‌మ‌యంలో ప‌ల్చ‌టి జుట్టును ఒత్తుగా సైతం మారుస్తాయి.కాబ‌ట్టి, హెయిర్ ఫాల్‌తో స‌త‌మ‌తం అయ్యేవారు మాత్ర‌మే కాదు ప‌ల్చ‌టి జుట్టుతో బాధ‌ప‌డేవారు కూడా ఈ జెల్‌ను వినియోగించ‌వ‌చ్చు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు