ముగిసిన కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తు గడువు

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తు గడువు ముగిసింది.

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా సుమారు ఎనిమిది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది.ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో సీట్ల కోసం దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చాయి.

వీటిలో అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టితో ముగియగా రేపటి నుంచి దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం జరగనుంది.

మరోవైపు టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం జరగనుంది.

Advertisement
Validation Check 2026