ఏపీ సీయం పై సంచలన కామెంట్స్ చేసిన రఘువీరా

అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా సరే తనదైన శైలిలో ఎదుటివాళ్ళ మీద మాటలతో విరుచుకుపడే నాయకుడు రఘువీరారెడ్డి.

ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా చంద్రబాబు పై సంచలన కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్స్ ఇప్పుడు టిడీపి తమ్ముళ్ళకి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.విజయవాడలో విలేఖరులతో మాట్లాడిన ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా ఇప్పటివరకు జరిగిన పోలవరం ప్రాజెక్ట్ పనులు అన్నీ కూడా మోసపూరితంగా సాగుతున్నవే అని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ఒక వేస్ట్ ఫెలో అని.ఎందుకు పనికిరాని వాడని విమర్శించారు.2019 కల్లా పోలవరం పూర్తి చేయకపోతే ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు ఉండబోదన్నారు.సదావర్తి భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా కోర్టులనే తప్పుదోవ పట్టించింది.

ఈ విషయంలో కోర్టు చివాట్లు పెట్టినా బాబుకి సిగ్గుకుడా లేకుండా దురిపోసుకున్తున్నాడు అని అన్నారు.అంతేకాదు ఏపీ కాంగ్రెస్ త్వరలోనే పోలవరాన్ని సందర్శిస్తుంది అని.అక్కడ జరుగుతున్న వకతవకలపై నిజా నిజాలు పూర్తిగా ప్రజల ముందు పెట్టి మేర్రు చేసే అన్యాయాలని ప్రజల ముందు పెట్టి సమాధానం అడుగుతాం అని చెప్పారు.కేంద్రానికి జీ హుజూర్ అని వంగి వండి ఉంటున్నాడు కాబట్టే విభజనలో మనకి రావాల్సిన హామీలు తీసుకురావడంలో విఫలం అయ్యారని తెలిపారు.

Advertisement

దీనికి తప్పకుండ మూల్యం చెల్లించుకునే రోజులు ఎంతో దూరం లేవని ఆయన తెలిపారు .

Advertisement

తాజా వార్తలు