తెలుగు దేశం పార్టీలో రోజు రోజుకి ముసలం పెరిగిపోతోంది.తెలంగాణా ఎన్నికల ప్రభావం పార్టీపై తీవ్రమైన ర్పభావం చూపుతోంది.
ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలోని నేతలపై తీవ్రమైన కోపోద్రేకాలు, అసహనం ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందట.సమన్వయ కమిటీ సమావేశంలోను , ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నేతలపై బాబు విరుచుకుపడుతున్నారట.
కొన్ని జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు అటకెక్కాయని ఎందుకు ఇంతటి అశ్రద్ద వహిస్తున్నారు అంటూ సీనియర్ నేతలపై కూడా బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.దాంతో
ఒక్క సారిగా నేతలకి చంద్రబాబు వ్యవహారంపై విసుగు రావడమే కాకుండా ఎన్నో అనుమానాలని రేకెత్తిస్తోందనే టాక్ వినిపిస్తోంది.ఎప్పుడూ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండే చంద్రబాబు కి ఏమయ్యింది.?? కొంపతీసి టీడీపీ చాప్టర్ క్లోజ్ అవుతోందా.?? ఎలాంటి సమస్యని అయినా పరిష్కరించే బాబు ఎందుకు ఇలా అయిపోయారు అనే ప్రశ్నలు నేతలని కుదిపేస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు టీడీపీకి సానుకూలంగా లేవు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ధర్మ సందేహమే.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలా జంప్ అయ్యిపోవాలా అనే ఆలోచనలు సీనియర్ నేతలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అందుకు తగ్గట్టుగానే సీనియర్ నేతలు అందరూ మీటింగ్ లు పెట్టుకుని మరీ టీడీపీ నుంచీ జంప్ అయ్యిపోవాలనే వ్యుహాలని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే కొంతమంది సీనియర్స్ వైసీపీ , జనసేన నేతలతో టచ్ లోకి కూడా వెళ్లారట.ఎలాగో జనసేన అధినేత వివిధ పార్టీలలో ఉన్న సీనియర్స్ ని ఆడరిస్తున్నాడు కాబట్టి ,మాంచి ఫామ్ లో ఉన్న జనసేన వైపు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తున్నారట.
ఇదిలాఉంటే కొందరు వైసీపీ తలుపు తట్టగా జగన్ వారిని ససేమిరా అనడంతో ఏమి చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.సీనియర్ నేతల వలన ఉపయోగం ఉంటుందనేది వాస్తవమే కాని.టీడీపీలో సీనియర్ నేతలని తమ పార్టీలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలంగాణలో వరుస పెట్టి సీనియర్స్ అందరూ ఓడిపోవడమే అందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు.
ఏది ఏమైనా సరే సీనియర్స్ టీడీపీ నుంచీ జంప్ చేయడం వలన వైసీపీ ,జనసేన పార్టీలకి పెద్దగా లాభం లేకపోయినా టీడీపీ పార్టీకి మాత్రం భారీ నష్టం తెచ్చి పెడుతుంది అంటున్నారు విశ్లేషకులు.మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి వ్యుహాలని అమలు చేస్తాడో వేచి చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy