Tammineni Sitaram : టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి ఏపీ స్పీకర్ నోటీసులు..!

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్( Tammineni Sitaram ) మరోసారి నోటీసులు పంపారు.ఈ మేరకు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బలరాం, వాసుపల్లితో పాటు మద్దాల గిరికి స్పీకర్ నోటీసులు అందించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను గతంలో విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ వంశీ, బలరాం, మద్దాల గిరి( Vamsi, Balaram, Maddala Giri ) విచారణకు హాజరు కాలేదు.ఈ క్రమంలోనే స్పీకర్ కార్యాలయం మరోసారి వారికి నోటీసులు పంపింది.

అలాగే ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ తమ్మినేని సీతారామ్ నోటీసులు ఇచ్చారు.ఇవాళ విచారణకు హాజరు కావాలని ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి,మేకపాటికి నోటీసులు అందజేశారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు