అడిగితే... వాలంటీర్లని సినిమా హాళ్లలో బాత్ రూమ్ లు కడగటానికి కూడా ఇస్తారా..?

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రఘు రామ కృష్ణం రాజు కి మరియు అధికార పక్షంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఇప్పటికే రఘు రామ కృష్ణం రాజు గత కొద్ది రోజులుగా వైకాపా పార్టీ నేతలపై మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.

ఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటుగా విమర్శలు చేస్తున్నాడు.అంతేకాకుండా ఆ మధ్య తనని పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ తాను ప్రజలు ఎన్నుకున్న నాయకుడని చెబుతూ పార్టీ లోని లోటుపాట్లు మరియు అవినీతి కార్యకలాపాలపై కామెంట్లు చేస్తూ వైకాపా పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు.

దీంతో రఘు రామ కృష్ణం రాజు తొందర్లోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తి చూపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో తప్పుడు కలెక్షన్లను అరికట్టేందుకు ఇక నుంచి ప్రతి ఒక్కరు సినిమా టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు యాప్ ని రూపొందిస్తూ టికెట్లు పొందడం మరింత సులభతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై తాజాగా మంత్రి రఘు రామ కృష్ణం రాజు స్పందించాడు.ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రలోకి రాజకీయ జోక్యం అవసరం లేదని ముఖ్యమంత్రికి సూచించాడు.

Advertisement
Ap Minister Raghurama Krishnam Raju Sensational Comments On Grama Volunteer, Rag

అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో చేయాల్సిన మంచి పనులు మరియు ప్రజలకు తీర్చాల్సిన కష్టాలు చాలా ఉన్నాయని కాబట్టి వాటిపై దృష్టి సారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశాడు.అంతేకాకుండా సినిమా థియేటర్ల యాజమాన్యం విషయంలో కూడా కలగ చేసుకోకూడదని ఒకవేళ సినిమా థియేటర్లలో బాత్ రూమ్ లు శుభ్రం చేయడానికి వాలంటీర్లను అడిగితే పంపిస్తారా.? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీంతో కొందరు వైకాపా అభిమానులు రఘు రామ కృష్ణం రాజుని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.

Ap Minister Raghurama Krishnam Raju Sensational Comments On Grama Volunteer, Rag

అంతేకాకుండా ప్రజా శ్రేయస్సు కోసం మొదలు పెట్టిన "వాలంటరీ వ్యవస్థ" గురించి ఇలా అసభ్యకరంగా కామెంట్లు చేయడం సమంజసం కాదని అంటున్నారు.అలాగే ఎలాంటి ఆదాయం ఆశించకుండా కేవలం 5 వేల రూపాయలకు మాత్రమే నెలంతా కష్టపడి వాలంటీర్లు పని చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు దగ్గర చేస్తున్నారని అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.అంతేకాకుండా తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సంబంధించిన విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాబట్టి మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు