తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి కాకాణి స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు.ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణ మాత్రమేనని పేర్కొన్నారు.

కచ్చితమైన ఫలితాలు ఉంటాయని చెప్పలేమని మంత్రి కాకాణి తెలిపారు.అనంతరం టీడీపీ నేత సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సోమిరెడ్డి ఉద్యమాలన్నీ కిరాయి ఉద్యమాలని ఆరోపించారు.ఎవరు కిరాయి ఇస్తే వారి తరపున ఉద్యమిస్తారని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే సోమిరెడ్డి లాంటి నటన ఎవరూ చేయలేరన్న మంత్రి కాకాణి ఆర్జీవీ లాంటి దర్శకులు సోమిరెడ్డిని పెట్టి సినిమాలు తీయొచ్చని విమర్శించారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు