జనసేనలో చేరిన ఏపీ హోమ్ మినిస్టర్ సోదరుడు !

ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి జనసేన పార్టీలో చేరారు.ప్రస్తుతానికి లక్ష్మణమూర్తి ఏ పార్టీలోనూ .

క్రియాశీలకంగా లేరు.జనసేనలో ఆయన చేరికపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.

తమ స్వగ్రామం పెదగాడవిల్లి అయినప్పటికీ పొరుగున ఉన్న చినగాడవిల్లి, మునిపల్లి గ్రామాల్లోని కాపు సామాజికవర్గం తమ కుటుంబానికి గత మూడున్నర దశాబ్దాలుగా అండగా ఉందని చెప్పారు.ఈ మూడు గ్రామాల్లోని కాపు యువత జనసేనలో చురుకైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.వారందరికీ అండగా ఉండటం తమ కుటుంబ బాధ్యతగా భావించి.

Advertisement

తాను జనసేనలో చేరానని చెప్పారు.

Advertisement