ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఏపీ హైకోర్టు తీర్పు

ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది.

ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.

అనంతబాబు కేసు సీబీఐకి ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు సీసీ ఫుటేజ్ లో ఉన్న వారందరిపై కేసు పెట్టాలని ధర్మాసనం పేర్కొంది.నిందితులు అందరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చాలని తెలిపింది.

అదేవిధంగా మూడు నెలల్లోపు ట్రయల్ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

Advertisement
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..

తాజా వార్తలు