వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా( CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్లు చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ఉంది.

ఇప్పటికే వైయస్సార్ కళ్యాణమస్తుకి చంద్రన్న పెళ్లి కానుక, వైయస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే తదితర పేర్లను మార్చిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా అసంఘటిత రంగంలోని కార్మికులకు అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకం( YSR Bima Scheme ) పేరును చంద్రన్న బీమాగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.ఈ రకంగా ఒకపక్క గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ప్రక్షాళన చేస్తూ మరోపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.ఇదిలా ఉంటే రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) జరగనున్నాయి.

రేపు ఉదయం 9:46 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, 22న స్పీకర్ ఎన్నిక చేయనున్నారు.

Advertisement
వైసీపీ లో భారీ ప్రక్షాళన తప్పదా ? వారి పదవులకు ఎసరు ? 

తాజా వార్తలు