చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు.

వికేంద్రీకరణపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ ఆలోచన అని తెలిపారు.

అమరావతిలో వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని వెల్లడించారు.రాజధాని అంశాన్ని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఉచ్చులో ఇతర పార్టీలు చిక్కుకోవద్దని సూచించారు.అమరావతి ఉద్యమం కృత్రిమ ఉద్యమమని రుజువైందని సజ్జల స్పష్టం చేశారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!