చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.

కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చిని ఎనిమిది మంది బలయ్యారని తెలిపారు.అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో అమాయకులను బలిగొన్నారని మండిపడ్డారు.

రోడ్ షోకు బాగా జనం వచ్చినట్లు కనబడాలన్నదే చంద్రబాబు ప్లాన్ అని, అందులో భాగంగానే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారని విమర్శించారు.ప్రమాదంపై చంద్రబాబుకు పశ్చాతాపం లేదని ఫైరయ్యారు.

ఈ ఘటనను కూడా ఎలా వాడుకోవాలనే చూస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబులో నటన, ప్రజలంటే లెక్కలేని తనమే కనబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

పోలీసులపై అనవసర విమర్శలు చేస్తున్నారన్న సజ్జల అధికారుల సూచనలు చంద్రబాబు పాటించారా అని ప్రశ్నించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు