ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి సరిగ్గా నాలుగు సంవత్సరాలు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan) ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.2019 ఏప్రిల్ 11వ తారీకు నాడు ఎన్నికలు జరగగా.

మే 23వ తారీకు నాడు ఫలితాలు వెలుపడ్డాయి.175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం జరిగింది.పార్లమెంటుకు సంబంధించి 22 ఇంకా రాజ్యసభకు సంబంధించి తొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలుపొందింది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సీఎం జగన్."దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో నాలుగేళ్ళ క్రితం మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది మీరు అప్ప‌గించిన బాధ్యతను మీకు సేవ చేసే అవ‌కాశంగా భావించి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను మ‌న ప్ర‌భుత్వంలో ఒక్కొక్క‌టిగా అమ‌లు చేశాం.

మ‌రోసారి మీకు సేవ చేసే అవ‌కాశం ల‌భించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం".అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.క్లీన్ స్వీప్ చేసే దిశగా.

Advertisement

పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతూ ఉంది.ఈ క్రమంలో నేతలను ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండేలా అధ్యక్షుడు జగన్ ఫలితాలు నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో వారి పనితీరు గురించి సర్వేలు చేసి ప్రజలలో పనితీరు బాగుంటే మాత్రమే టికెట్ ఇస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు.ఈ రకంగా వచ్చే ఎన్నికలకు వైసీపీ నేతలను సీఎం జగన్ రెడీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు