ఈనెల 6 న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు ఈనెల 6వ తేదీన ఆయన హస్తినకు పయనం కానున్నారు.

ఈ క్రమంలో రెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారని తెలుస్తోంది.ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రధానితో కూడా సమావేశాలపై రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా చర్చలు జరపనున్నారని సమాచారం.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide