జాగ్రత్త ఫినిష్ అయిపోతావ్ ! మహిళను బెదిరించిన బాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో ఇప్పుడు ఎక్కడ లేని కోపం పెరిగిపోయింది.చీటికీ మాటికీ అందరి మీద చిరాకు పడుతూ కనిపిస్తున్నారు.

తాజాగా ఈ రోజు ఓ బీజేపీ మహిళా నాయకురాలి మీద బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.ఆ నాయకురాలిని ఉద్దేశించి.

జాగ్రత్తగా ఉండు, నీకు చాలా సమస్యలు వస్తాయి, అసలు నీకు సిగ్గుందా, వేషాలు వేస్తే సహించేది లేదంటూ చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబును జేఎన్టీయూ వద్ద బీజేపీ నేతలు అడ్డుకున్న సందర్భంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ బాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాబు ఏపీ కి అన్యాయం చేస్తున్న మోదీకి మీరేలా మద్దతిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన మోదీకి మద్దతివ్వడానికి సిగ్గుందా మనకు ద్రోహం చేసిన మోదీని వెనకేసుకు వస్తారా అంటూ మండిపడ్డారు.ఈ జన్మభూమిపై ఉన్నారు ఇక్కడ నీరు తాగారు.

ఇక్కడ గాలి పీల్చారు అలాంటిది రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీకి సహకరిస్తారా అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.

ఓ మహిళా బీజేపీ నేతపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.నీకు సిగ్గుందా అంటూ ఫైర్ అయ్యారు.రాష్ట్రానికి మంచి చెయ్యాలన్న కమిట్మెంట్ ఉందా అంటూ ధ్వజమెత్తారు.

మిమ్మల్ని కొడతారు, లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటారు, ఫినిష్ అయిపోతారు అంటూ విరుచుకుపడ్డారు.దీంతో ఆ మహిళా నేత బెదిరిస్తున్నారా అంటూ ఆమె బాబు ని నిలదీసింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

ప్రస్తుతం బాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Advertisement