చంద్రబాబు కు టెన్షన్ పెరిగిపోతోందా ? సూపర్ సిక్స్ గుదిబండగా మారిందా ?

ఏపీలో అధికారంలోకి వచ్చాము అన్న సంతోషం ఎక్కడా టిడిపి అధినేత చంద్రబాబు లో( CM Chandrababu ) కనిపించడం లేదు.

ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే  ఉండడం, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించకపోవడం,  ప్రధానంగా సూపర్ సిక్స్( Super Six ) పేరుతో ప్రకటించిన పథకాలు గుదిబండ గా కనిపించడం వంటివి టిడిపి, జనసేన ,బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువైన పని కాదని ఇప్పటికే అర్థమైంది.ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి చూసుకున్న సూపర్ సిక్స్ వంటి పథకాలు అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదనే విషయం అర్థమవుతుంది .అయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయి.దీంతో ఏదోరకంగా ఏపీ ఆర్థిక పరిస్థితిని( AP Financial Condition ) మెరుగుపరిచి ఎన్నికల సమయంలో ప్రకటించిన అన్ని హామీలను ఏదో రకంగా చంద్రబాబు అమలు చేస్తారని ఆ పార్టీ నాయకులు,  మంత్రులు , ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.

Ap Cm Chandrababu Tension Over Implementation Of Super Six Schemes Details, Tdp,

ఈ హామీల అమలు విషయంలో కొంత సమయం తీసుకున్నా.తప్పకుండా అమలు చేయాల్సిందేనని,  లేకపోతే జనాలు తమను నిలదీస్తారనే భయం టిడిపి ఎమ్మెల్యేలు,  మంత్రులలో ఉంది.ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ తో పాటు , మిగతా అన్ని హామీలను అమలు చేయాలంటే ఏడాదికి లక్షన్నర 2 రూపాయలు కావాల్సి ఉంటుంది.

  అయితే అంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం కనిపించడం లేదు.ఇక కేంద్ర ప్రభుత్వం పైనే చంద్రబాబు భారం వేశారు.కానీ అక్కడ నుంచి నిధులను( Funds ) మంజూరు చేయించుకోవడం అంత ఆషామాషీ కాదు అనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.

Advertisement
Ap Cm Chandrababu Tension Over Implementation Of Super Six Schemes Details, TDP,

అయితే ఈ విషయంలో కేంద్రం తో కయ్యానికి దిగే సాహసము చంద్రబాబు చేసే పరిస్థితిలో లేరు.

Ap Cm Chandrababu Tension Over Implementation Of Super Six Schemes Details, Tdp,

తమ మిత్రపక్షంగా ఉన్న బిజెపితో( BJP ) వైరం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.సూపర్ సిక్స్ పథకాలతో పాటు,  ఇతర హామీలను అమలు చేయడంతో పాటు,  రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి బాటలు వేయడం , నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు నిధుల కేటాయింపు వంటి విషయాల పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ సాధ్యం కావాలంటే భారీగానే నిధులు అవసరం అవుతాయి.కానీ ఆ నిధులను సమకూర్చుకోవడం అతి పెద్ద సమస్య గా ఉండడం తోనే చంద్రబాబు ను , కూటమి ప్రభుత్వాన్ని మరింతగా టెన్షన్ పెడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు