ఎపీకి కొత్త ఆర్ధిక మంత్రి..రేసులో ఉన్నవాళ్ళు ఎవరంటే

సంక్రాంతి తరువాత జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ఆర్ధిక మంత్రి యనమల.రామకృషుడు ని పంపేందుకు రంగం సిద్దం అయ్యింది.

టిడిపిలో గత మూడు దశాబ్దాలుగా ఎన్నో సేవలని అందించిన యనమాలని బీసీ కోటాలో రాజ్యసభకి పంపడం దాదాపు ఖాయం అయ్యింది అనే తెలుస్తోంది.యనమల కూడా ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

మొన్నటికి మొన్న మీడియాతో అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా వెళ్తాను అని తెలిపారు కూడా.మరి యనమల వెళ్ళిపోతే అంతే సమర్ధవంతంగా ఆర్ధిక శాఖని నడపగల శక్తి ఎవరికీ ఉంది.?ఎన్నికలకి సరిగా సంవత్సరం మాత్రమే సమయం ఉంది.ఈ శాఖకి ఎవరు అర్హులు అనే విషయంలో చంద్రబాబు కొతమంది పేర్లని పరిశీలిస్తున్నారట.

య‌న‌మ‌ల వెళ్ళిపోతే ఏపీ కొత్త ఆర్థిక‌మంత్రి ఎవరా అనే విషయంలో ఇప్పటికే పార్టీలో ఎవరి అంచనాలు వారు వేసుకున్తున్నారట.య‌న‌మ‌ల గ‌తంలో కూడా ఆర్థిక‌మంత్రిగా ప‌నిచేశారు.

Advertisement

ఇక ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వ ఏర్ప‌డిన ఈ నాలుగేళ్ల‌లోను ఆయ‌నే ఆర్థిక‌మంత్రిగా ఉండ‌డంతో బాబుకు ఇప్ప‌టి వ‌ర‌కు కీల‌క‌మైన ఆర్థిక‌శాఖ ఎవ‌రికి అప్ప‌గించాల‌నే విష‌యంలో పెద్ద టెన్ష‌న్ త‌ప్పింది.కానీ ఇప్పుడు యనమల ఉండరు మరి ఆస్థాయిలో ఎవరు ఈ శాఖని చూడగలరు.

సీనియర్స్ లో ఎవరు ఉన్నారు అంటూ లెక్కలు వేస్తున్నారట చంద్రబాబు ఇదిలా ఉంటే.ఏపీకి ఆర్ధిక మంత్రి రేసులో.ఇంతకుముందు వైఎస్ హయాంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపిస్తోందట.

ఆనం పార్టీ మారినపుడు తగిన న్యాయం చేస్తాను అని బాబు మాట కూడా ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఆనం పేరు గట్టిగానే వినిపిస్తోంది.ఇదే సమయంలో మంత్రి నారాయణ పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి కళా వెంకటరావు, రవాణాశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్ల‌తో పాటు మానవవనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావుల పేర్లు చర్చకు వస్తున్నాయి.అయితే నారాయ‌ణ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

నెల‌స‌రి స‌మ‌యంలో పుదీనా తింటే ఏం అవుతుందో తెలుసా?

అదే జ‌రిగితే ఆయ‌న వియ్యంకుడిగా ఉన్న గంటాకు ఈ కీల‌క శాఖ ఇస్తారేమో అని భావిస్తున్నా.చాలా రోజుల నుంచీ ఘంటా తన శాఖకి సంభందించిన విషయంలో చాలా అశ్రద్ధ వహించడం ఫైల్స్ పట్టించుకోక పోవడం ఇలా కొన్ని కారణాల వల్ల.

Advertisement

ఘంటాకి అవకాశం లేకపోవచ్చు అని వినిపిస్తోంది.అలా అని అనుభవం లేని వ్యక్తులకి అవకాసం ఇవ్వలేరు.

మరి చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని ఎదురుచూస్తున్నారు సీనియర్ మంత్రులు.

తాజా వార్తలు