చంద్రబాబు కి కాలిలో ముల్లు..కంట్లో నలుసు ఆ ఒక్కటే

దేశంలో ముందస్తు ఎంతమంది కొంప ముంచుతుందో తెలియదు కాని మొత్తానికి రాజకీయ పార్టీల స్థితి గతులని మాత్రం మార్చేస్తుంది.ఎన్నికలు ఇంకా ముందర ఉన్నాయిలే ఈలోగా ఏదన్నా చేసేయచ్చు అనుకునే వారికి ఈ ముందస్తు ఎన్నికలు బ్రేక్ వేసేలా ఉన్నాయి అయితే జమిలి ఎన్నికల నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు మేము సిద్దం అంటున్నాయి మరి ఏపీ పరిస్థితి ఎలా ఉంది.

? చంద్రబాబు కి ఈ సారి మళ్ళీ ఏపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా లేదా.? అధికారం దక్కుతుందా అంటే రాజకీయ పండితులు తప్పకుండా మళ్ళీ చంద్రబాబే సీఎం అంటున్నారు.కానీ.

ఆ ఒక్కటే బాబు కి ఇబ్బంది కరమైన పరిణామం అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ “ఆ ఒక్కటి” ఏమిటి.? ప్రస్తుత రాజకీయ పరిస్తితితుల్లో చంద్రబాబుకు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే.ఏపీ ప్రజలకి చంద్రబాబు పై ఉన్న నమ్మకం.

ఒకటైతే.ఏపీకి ద్రోహం చేసిన బీజేపీ పై పీకల్లోతు కోపం ఒకటి.

Advertisement
Ap Capital Development Effect On Chandrababu-చంద్రబాబు కి

ఈరెండు బాబు కి కలిసొచ్చే అంశాలే అయితే ఈ రెండూ జగన్ సీఎం కుర్చీ కోరికని దూరం చేసేలా ఉన్నాయి సరిగ్గా దీన్నే రాజకీయపరంగా చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు.ఎంపీల రాజీనామాల పేరుతో వీలైనంతగా డిఫెండ్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది.

అయితే అక్కడా ఎదురు దెబ్బలు తిన్నట్లయింది.

Ap Capital Development Effect On Chandrababu

రాజీనామాలతో లబ్ది పొందాల్సింది పోయి ప్రజలతో చివాట్లు తిన్నాడు.ఇదిలాఉంటే.పాలనాపరంగా కూడా చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం బాగా పెరిగింది.

అనుభవజ్ఞుడు.అందులోనూ నదుల అనుసంధానంతో కరువు ప్రాంతమైన అనంతపురం వరకు కూడా నీళ్లను తీసుకెళ్ళి ఆంధ్రా బగీరధుడు అయ్యారు దాంతో రైతులు సైతం బాబు వైపే మొగ్గు చూపుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

పోలవరం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.చంద్రబాబు హయాంలోనే అది జరిగితీరాలని ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక్కడి వరకూ చంద్రబాబు కి వచ్చిన ఇబ్బందిలేదు అయితే ఇప్పటి చంద్రబాబుకు అంతో ఇంతో ఇబ్బంది కలిగించేది ఒకే ఒక్క విషయం “అమరావతి” నిర్మాణమే.రాష్ట్రం విడిపోయి నాలుగేళ్ళు అవుతున్నా సరే విడిపోయి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటివరకు అమరావతి నిర్మాణం ముందుకు సాగలేదు.

ఎన్నికల సమయానికి ప్రజలు సంతృప్తి చెందేలా అయినా సరే దీన్ని తీర్చి దిద్దాలని అనుకుంటున్నారు.కానీ ఇప్పుడు ఆశలు సన్నగిల్లిపోయాయి ఇంకా టెండర్ల దశ కూడా దాటలేదు.

ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.అయితే చంద్రబాబు ఈ విషయంలో కూడా ఎంతో సునాయసనంగా సంధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నారట.

అదేంటంటే.అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయని.

ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు క్లాసులు కూడా ప్రారంభించాయని.నాలుగేళ్ల కిందటితో పోలిస్తే… అమరావతి రూపురేఖలు మారిపోయాయని.

నన్ను నమ్మండి నేను ఉన్నాను కదా అంటూ ప్రజలకి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలని బాబు ఆలోచన.అంతేకాదు గతంలో ఎలా అయితే చంద్రబాబు పని తీరుని చూసి సీఎం చేసుకున్నారో అలాగే రాష్ట్ర ప్రజలో మరో మారు బాబు ని సీఎం కుర్చీలో కూర్చోపెడుతారు అంటున్నారు తెలుగుదేశం సీనియర్ నేతలు.

అయితే ఆ ఒక్క అమరావతి నిర్మాణం విషయంలో ప్రజలకి క్లారిటీ ఇచ్చేస్తే గెలుపు తెలుగుదేశం సొంతం అంటున్నారు విశ్లేషకులు సైతం.

తాజా వార్తలు